Hyderabad, ఏప్రిల్ 14 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆఫీస్‌కు వచ్చిన క్లైంట్స్‌కు 24 గంటల్లో బిల్స్ క్లియర్ చేస్తానని హామీ ఇచ్చి పంపించేస్తుంది కావ్య. తర్వాత మన సమస్యలు క్లైంట్స్ వరకు చేరకూడదు. అది మనకే భవిష్యత్తులో సమస్య అవుతుంది. కల్యాణ్ జ్యూలర్స్ వాళ్లను మనీ పే చేయమని అడగండి అని కావ్య మేనేజర్‌కు చెబుతుంది.

తర్వాత ఇంటికి కావ్య వస్తుంది. గుమ్మంలోనే అప్పు ఎదురుచూస్తుంటే కావ్య అడుగుతుంది. నీకోసమే ఎదురుచూస్తున్నాను. అపర్ణ అత్తయ్య పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుంది. ఏం తినట్లేదు. కనీసం మంచి నీళ్లు కూడా తాగట్లేదు అని అప్పు చెబుతుంది. తెలుసు. అత్తయ్యకు పరిష్కారం ఆయనే. ఆయన్ను తిరిగితీసుకురావడానికి ఇంకా టైమ్ పడుతుంది అని కావ్య అంటుంది. కానీ, అప్పటివరకు అలాగే వదిలేయం లేం కదా. బావ బతికే ఉన్నాడనే నిజం ...