భారతదేశం, ఏప్రిల్ 12 -- కావ్య‌ను క‌ల‌వ‌డానికి ఆఫీస్‌కు వ‌స్తాడు రాజ్‌. మీతో మాట్లాడ‌టానికి వ‌చ్చాన‌ని అంటాడు. భ‌ర్త ముందు నిజాలు మాట్లాడ‌లేక‌పోతున్నందుకు బాధ‌ప‌డుతుంది కావ్య‌. ఏమైంద‌ని రాజ్ అడుగుతుంది. వ‌ర్క్ వ‌దిలేసి వ‌చ్చా క‌దా అదే ఆలోచిస్తున్నాన‌ని అబ‌ద్ధం ఆడుతుంది.

మిమ్మ‌ల్ని మొద‌టిసారి చూసిన‌ప్పుడు మీరు నాకు బాగా కావాల్సిన వాళ్ల‌లా అనిపించార‌ని రాజ్ అంటాడు. నాలాగే మీకు అనిపించిందా అని కావ్య‌ను అడుగుతాడు. మీ క‌ళ్ల‌ల్లోకి చూస్తే మ‌న మ‌ధ్య ఏదో బంధం, ప‌రిచ‌యం ఉంద‌ని నా మ‌న‌సు స్ట్రాంగ్‌గా చెబుతుంద‌ని రాజ్ చెబుతాడు. కానీ ఆ బంధం ఏదో తెలియ‌డం లేద‌ని అంటాడు. నేనంటే గ‌తం మ‌ర్చిపోయాను.

మీరు బాగానే ఉన్నారు క‌దా...మ‌నం ఇంత‌కు ముందు ఎప్పుడు, ఎక్క‌డ క‌లిశామో చెప్ప‌మ‌ని కావ్య‌ను నిల‌దీస్తాడు రాజ్‌.ఈ రోజు స‌మాధానం చెప్ప‌కుండా మిమ్మ‌ల్ని ఎక్క‌డికి ...