Hyderabad, ఏప్రిల్ 11 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో హాల్లో ఉన్న ఇందిరాదేవికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లొస్తానని చెబుతుంది. వెంటే వచ్చిన కల్యాణ్‌ను చూసి కల్యాణ్‌ను కూడా తీసుకెళ్తున్నావా ఏంటీ అని ఇందిరాదేవి అడుగుతుంది. మొగుడిని చూడకుండా ఉండలేకపోతుందేమో అని స్వప్న అంటుంది.

నువ్ ఇలాంటి ఐడియాలు ఇవ్వకు స్వప్న. ఒకవేళ తనకు నిజంగానే అప్పుకి అలాంటి ఫీలింగ్ కలిగితే నన్ను చూడటం కోసం ఏ తప్పుడు కేసులో అయినా ఇరికించి జైలులో పెట్టిన పెడుతుంది అని కల్యాణ్ అంటాడు. మరెక్కడికి వెళ్తున్నారు అని స్వప్న అడిగితే.. కల్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను కలవడానికి వెళ్తున్నాడు. దారిలోనే కదా డ్రాప్ చేద్దామని తీసుకెళ్తున్నా అని అప్పు అంటుంది. మిమ్మల్ని చూస్తే జెలసీగా ఉందే. నా మొగుడు ఉన్నాడు తినడం పడుకోవడం తప్పా అని స్వప్న అంటాడు.

వ...