Hyderabad, ఏప్రిల్ 10 -- Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో గుడిలో కావ్యను చూసిన యామిని ఎలాగైనా రాజ్‌ను తీసుకుని వెళ్లాలని అంటుంది. రామ్‌ను ఇక్కడికి తీసుకురావడానికి ఎంత కన్విన్స్ చేశాం. ఇప్పుడు వెళ్లిపోదాం అంటే ఏమనుకుంటాడు అని వైధేహి అంటుంది.

ఇప్పుడు రామ్ అనుకోవడం ముఖ్యం కాదు. వెళ్లడం ముఖ్యమని యామిని అంటుంది. రాజ్‌తో అత్తాపూర్‌లో శ్రీరామ నవమి గ్రాండ్‌గా జరుగుతుందట. అక్కడికి వెళ్దాం. అక్కడ మనకు తెలిసినవాళ్లు ఉన్నారు. ఇలా దూరంగా కాకుండా ముందు వరుసలో కూర్చోబెడతారట అని యామిని చెబుతుంది. దాందేముంది, దేవుడు ఎక్కడైనా దేవుడే కదా. ఇక్కడే ఉందాం అని రాజ్ అంటాడు. మనం వచ్చేదాకా వాళ్లు కల్యాణం జరిపించరట. వాళ్లు అంత అభిమానం చూపిస్తుంటే ఎలా కాదనగలం అని యామిని చెబుతుంది.

ఇంతసేపు కళావతి కోసం వెయిట్ చేశాను. కనిపించింది...