Hyderabad, జనవరి 26 -- Brahma Mudi Serial Latest Episode: బ్రహ్మముడి సీరియల్‌ తాజా ఎపిసోడ్‌‌లో నందగోపాల్ హత్యపై కావ్య, రాజ్ పడుతుంటారు. మనకు నంద గోపాల్ చస్తే వంద కోట్ల నష్టం వస్తుంది. అదే నంద గోపాల్ బతికి ఉంటే ఎవరికి నష్టం, ఆ అవసరం ఎవరికీ ఉంది. నంద గోపాల్ బతికి ఉండటం ఎవరికి ఇష్టంలేదో అనే కోణంలో ఆలోచించాలి అని కావ్య అంటుంది.

నువ్ చెప్పింది కరెక్టే. ఈ కోణంలో నేను కూడా ఆలోచించలేకపోయాను అని రాజ్ అంటాడు. మరోవైపు చెస్ ఆడుతూ సంబరపడిపోతారు అనామిక, సామంత్. ఆ నంద గోపాల్‌ను చంపేసి రాజ్‌కు భలే చెక్ పెట్టావ్ అని సామంత్ అంటాడు. మరి నన్ను అవమానించినవాళ్లకు తెలియాలి కదా ఈ అనామిక తలుచుకుంటే ఏం చేస్తుందో అని అనామిక అంటుంది.

ఇప్పుడు ఆ నందాగాడు చచ్చిపోయాడు కాబట్టి చచ్చినట్లు వంద కోట్లు బ్యాంక్‌కు కట్టాలి. అందుకోసం మరింత అప్పులు చేస్తారు. మరోవైపు రుద్రాణి ఆ...