భారతదేశం, ఫిబ్రవరి 14 -- టాలీవుడ్ సీనియ‌ర్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం, ఆయ‌న త‌న‌యుడు రాజా గౌత‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ బ్ర‌హ్మా ఆనందం. తాతా మ‌న‌వ‌ళ్ల అనుబంధంతో ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి ఆర్‌వీఎస్ నిఖిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శుక్ర‌వారం రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? బ్ర‌హ్మానందం, రాజా గౌత‌మ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించారా? లేదా?

బ్ర‌హ్మానందం (రాజా గౌత‌మ్‌) చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోతాడు. తాత ఆనంద మూర్తి ( బ్ర‌హ్మానందం) తో పెద్ద‌గా సంబంధాలు ఉండ‌వు. ఏ ప‌ని పాట లేకుండా అప్పులు చేస్తూ స్నేహితుడు గిరి సాయంతో బ‌తికేస్తుంటాడు. గొప్ప థియేట‌ర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోవాల‌ని బ్ర‌హ్మానందం క‌ల‌లు కంటుంటాడు. నేష‌న‌ల్ లెవెల్‌లో టాలెంట్ చూపించే అవ‌కాశం అత‌డికి వ‌స్తుంది.

కానీ అందులో పాల్గొనాంటే ఆరు ల‌క్ష‌లు అవ‌స‌రం ...