Hyderabad, మార్చి 24 -- ఈతరం అమ్మాయిలకు బ్రా అత్యవసర లోదుస్తులుగా మారిపోయింది. శరీరాకృతిని అందంగా చూపించేందుకు బ్రాలు సహాయపడతాయి. పాఠశాల స్థాయి నుంచి అమ్మాయిలు బ్రా ధరించడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటికీ బ్రా ధరించడం పై ఎన్నో అపోహలు, సందేహాలు ఉన్నాయి.

బ్రా ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని నమ్మే వాళ్ళు ఎక్కువే. అందుకే చాలామంది గ్రామస్తులు, చీరలు కట్టుకునే వారు బ్రా ధరించడానికి ఇష్టపడడం లేదు. అయితే బ్రాకు, బ్రెస్ట్ క్యాన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు నిపుణులు. తాత్కాలిక సౌకర్యం కోసమే ధరించాలని, అసౌకర్యంగా ఉంటే మానేయవచ్చని చెబుతున్నారు. అంతేతప్ప అది రొమ్ములపై ఎలాంటి తీవ్రమైన ప్రభావాలను చూపించదని వివరిస్తున్నారు. నీ శరీరాకృతి అందంగా కనిపించాలనుకుంటే బ్రా ధరించవచ్చు. లేదా మీకు వాటితో అసౌకర్యంగా అనిపిస్తే మానేయవచ్చు. అంతేకానీ...