Hyderabad, మార్చి 23 -- ఈ రోజుల్లో రక్తపోటు, షుగర్ అనేవి అందరి ఇళ్లల్లోనూ ఉండే సాధారణ సమస్యలుగా మారాయి. వీటిని ఎప్పటికప్పుడు పరీక్షించుకుని తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోక తప్పడం లేదు. చాలా మంది రక్తపోటు, షుగర్‌లో హెచ్చు తగ్గులకు పరీక్షించుకునేందుకు తరచూ డాక్టర్ దగ్గరకు వెళ్లలేక మిషన్ తెచ్చుకుని ఇంట్లోనే పరీక్షలు చేసుకుంటున్నారు.

బిపీ చెక్ చేసుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మెషిన్లు దొరుకుతాయి. వీటి సహాయంతో బీపీ పెరుగుతుందో, తగ్గుతుందో తెలుసుకుని దాన్ని సాధారణ స్థాయిలో ఉంచుకోవడానికి ఆహారం, మందులు వాడుకోవచ్చు. ఇది మంచి విషయమే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. చాలా మంది రక్తపోటును చెక్ చేసుకునేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు చేస్తారు. దీనివల్ల వారు సరైన బీపీని తెలుసుకోలేరు. ఈ విషయం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ సౌరభ్ బాలీ తన సోషల్ మీడియాలో వివరంగా...