భారతదేశం, ఫిబ్రవరి 10 -- మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన లైలా చిత్రం ఫిబ్రవరి 14వ తేదీని రిలీజ్ కానుంది. ఈ రొమాంటిక్ కామెడీ యాక్షన్ మూవీలో విశ్వక్ లేడీ గెటప్ కూడా వేశారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ బోల్డ్ కంటెంట్‍తో క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‍లో నటుడు 30 ఇయర్స్ పృథ్వి చేసిన కామెంట్లు నిప్పు రాజేశాయి. ఈ మూవీని బాయ్‍కాట్ చేయాలంటూ ఓ రాజకీయ పార్టీకి చెందిన మద్దతుదారులు పిలుపునిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో 'బాయ్‍కాట్ లైలా' నేడు ట్రెండ్ అవుతోంది.

లైలాలో ఓ సన్నివేశం గురించి ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో పృథ్వి మాట్లాడారు. మేకల సత్తిగా తాను చేశానని చెప్పారు. మేకలు ఎన్ని ఉన్నాయని షాట్ మధ్యలో అడిగితే.. 150 ఉన్నాయని చెప్పారని అన్నారు. యాధృచ్ఛికమో ఏమో కానీ సిన...