Hyderabad, మార్చి 3 -- ఏ అనుబంధంలోనైనా ముద్దు పేర్లు పెట్టుకుని పిలవడం కామన్. అందరూ పిలిచేలా సొంత పేరుతో పిలిస్తే కొత్తదనం ఏముంటుంది? మీరు పిలిచే పేరులోనే మీకు వారిపై ఉండే ప్రేమ అంతా కనిపించాలి. అందుకే ముద్దు పేర్లు అనే కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. ఇంట్లో కూడా పిల్లలకు ముద్దు పేర్లు ఉంటాయి. భార్యాభర్తలు కూడా ముద్దుగా పెట్ నేమ్స్ తో పిలుచుకుంటూ ఉంటారు. అలాగే బాయ్ ఫ్రెండ్ ,గర్ల్ ఫ్రెండ్స్ కు కూడా ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువమంది తమ ప్రియుడిని లేదా ప్రేమికురాలిని బేబీ అని పిలుస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇదే పేరుతో పిలిస్తే కొత్తదనం ఏముంటుంది? కాస్త కొత్త పేర్లను ప్రత్యేకమైన పేర్లను ప్రయత్నించండి. మేము కొన్ని ముద్దు పేర్లు ఇక్కడ ఇచ్చాము. మీరు ప్రేమగా చూసుకునే వారికి ఇవి ఎంతో అందంగా సెట్ అవుతాయి.

మీరు మీ బాయ్ ఫ్రెండ్‌కి ప్రత్యేకమైన ట...