Hyderabad, ఫిబ్రవరి 4 -- బూందీ కూర ఎప్పుడైనా తిన్నారా? దీన్ని రుచి చూశారంటే వదల్లేరు. అంత టేస్టీగా ఉంటుంది. సమయం లేనప్పుడు ఐదు నిమిషాల్లో అయిపోయే కూర ఇది. ఇంట్లో బూందీ రెడీగా ఉంటే చాలు... ఈ కూరను ఐదు నిమిషాల్లో వండి లంచ్ బాక్స్ పెట్టవచ్చు. దీన్ని అన్నంలో కలుపుకొని తిన్నా చపాతీతో తిన్నా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది. స్పైసీగా కావాలనుకుంటే దీన్ని పచ్చిమిర్చి జోడించి స్పైసీగా చేసుకోవచ్చు. ఏదేమైనా బూందీ కూర రెసిపీ చాలా సులువు.

బూంది - ఒక కప్పు

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

కారం - పావు స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

నూనె - ఒక స్పూన్

1. ఇంట్లో బూందీ రెడీగా ఉంటే చాలు ఐదు నిమిషాల్లో కూరను వండేసుకోవచ్చు.

2. దీనికోసం ముందు ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టు...