భారతదేశం, మార్చి 21 -- ఐపీఎల్ 18వ సీజన్ శనివారం (మార్చి 22) స్టార్ట్ అవుతుంది. సాయంత్రం రాత్రి 7.30కు ఆరంభ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంతకంటే ముందే బాలీవుడ్ స్టార్స్ క్రికెట్ గ్రౌండ్ లో సత్తాచాటేందుకు సై అంటున్నారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి అగ్రశ్రేణి బాలీవుడ్ హీరోలు ఈ మ్యాచ్ కు అటెండ్ కాబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ నిర్వహించడం వెనుక ఓ మంచి కారణం ఉంది.

టీబీ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. శనివారం ముంబయిలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని ఎంసీఏ క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ టీమ్ తో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి జట్టు తలపడనుంది. 50 మందికి పైగా సెలబ్రిటీలు ఈ మ్యాచ్ కు హాజరు కానున్నారు, వారిలో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్...