భారతదేశం, ఏప్రిల్ 2 -- 2025 సంవత్సరానికి సంబంధించిన ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాను బుధవారం (ఏప్రిల్ 2) ఆ మ్యాగజైన్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3028 మంది డాలర్ బిలియనీర్లను ఈ జాబితాలో పేర్కొన్నారు, వీరిలో 205 మంది భారతదేశం నుంచి ఉన్నారు. వీళ్లలో బాలీవుడ్ లోని ఏకైక బిలియనీర్, అత్యంత ధనవంతుడు ఎవరో ఇక్కడ చూసేయండి. ఒకప్పుడు టూత్ బ్రష్ లు తయారు చేసిన అతను.. ఇప్పుడు అతిపెద్ద సూపర్ స్టార్ల కంటే ధనవంతుడు.

ఫోర్బ్స్ ప్రకారం, హిందీ సినిమా రంగంలో ఒక బిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన ఏకైక వ్యక్తి.. సినిమా మాగ్నేట్, వ్యాపారవేత్త రోనీ స్క్రూవాలా. ఫోర్బ్స్ కొత్త లిస్ట్ ఫ్రకారం.. ఈ మీడియా మొగల్ నికర విలువ 1.5 బిలియన్ డాలర్లు. ఇది ఆయనను ఆ రంగంలోని ప్రతి సూపర్ స్టార్ కంటే ధనవంతుడిని చేసింది,

షారూక్ ఖాన్ (770 మిలియన్ డాలర్లు), సల్మాన్ ఖాన్ (390 మిలియన్...