భారతదేశం, ఫిబ్రవరి 5 -- Bollywood OTT: బేబీ జాన్ మూవీతో బాలీవుడ్‌లో తొలి అడుగు వేసింది కీర్తి సురేష్‌. త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ తేరీ రీమేక్‌గా తెర‌కెక్కిన బేబీ జాన్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. స‌డెన్‌గా ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. బుధ‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంట‌న్ విధానంలో విడుద‌ల‌చేశారు. వాలెంటైన్స్ డే నుంచి ఫ్రీ స్ట్రీమింగ్‌కు బేబీ జాన్ మూవీ అందుబాటులోకి రానున్న‌ట్లు స‌మాచారం.

బేబీ జాన్ మూవీలో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టించాడు. కీర్తి సురేష్‌తో పాటు వామికా గ‌బ్బి మ‌రో హీరోయిన్‌గా క‌నిపించింది. జాకీ ష్రాఫ్ విల‌న్ రోల్ చేశాడు. క‌లీస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ డిసెంబ‌ర్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది.

స‌ల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయ‌డం, ప్ర‌మోష‌న్స్ భారీగా నిర్వ‌హించ‌డంతో పాటు టీజ‌ర్‌, ట్రైల‌ర్...