భారతదేశం, ఫిబ్రవరి 11 -- సినీ స్టార్ హీరోలకు అభిమానగణం అధికంగా ఉంటుంది. తన అభిమాన నటుడి కోసం ఏమైనా చేస్తామనేలా డైహార్డ్ అభిమానులు కూడా ఉంటారు. బాలీవుడ్ సీనియర్ హీరోకు కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆయనంటే అమితంగా అభిమానిస్తారు. అయితే, ఓ మహిళా అభిమాని మాత్రం ఆయనపై ఉన్న అభిమానంతో ఏకంగా ఆస్తినే రాసిచ్చేశారు. చనిపోతూ రూ.72కోట్ల విలువైన ఆస్తి సంజయ్‍కు దక్కాలంటూ వీలునామా రాశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ముంబైకు చెందిన నిషా పాటిల్ (62) అనే మహిళ సంజయ్ దత్‍కు వీరాభామాని. ఆమెనే చనిపోయే ముందు ఆయనకు రూ.72కోట్ల ఆస్తిని రాసిచ్చారు. నిషా పాటిల్ ఇటీవలే అనారోగ్యం కారణంగా మృతి చెందారు. అయితే, చనిపోయే ముందే బ్యాంకులకు ఆమె కొన్ని లెటర్స్ రాశారట. సంజయ్ దత్‍కే తన డబ్బు బదిలీ చేయాలని తెలిపారని సమాచారం. అలాగే తన ఆస్తి మొత్తం సంజయ్ దత్‍కే చెందుతుందని వీలునామా క...