భారతదేశం, ఫిబ్రవరి 16 -- బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఛావా చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ హిస్టారికల్ యాక్షన్ చిత్రం ఈ శుక్రవారం ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలో రిలీజైంది. కొన్ని వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ మూవీ విడుదలైంది. క్రేజ్‍తో వచ్చిన ఛావా చిత్రం అంచనాలను అందుకుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లలోనూ అదరగొడుతోంది.

ఛావా చిత్రం రెండు రోజుల్లో ఇండియాలో రూ.67.50 కోట్ల నెట్ కలెక్షన్లను దక్కించుకుంది. భారత్‍లో తొలి రోజు రూ.31కోట్లు రాగా.. రెండో రోజు రూ.36.50కోట్లను ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కంటే రెండో రోజు కలెక్షన్లలో వృద్ధి ఉంది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లపరంగా ఈ చిత్రం రూ.100కోట్లు దాటేసినట్టు తెలుస్తోంది.

ఛావా సినిమాకు ఆదివారమైన మూ...