భారతదేశం, ఫిబ్రవరి 9 -- తెలుగు నటుడు హర్షవర్ధన్ రాణే, మావ్రా హొకానే హీరీహీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ 'సనమ్ తేరి కసమ్' 2016 ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ హిందీ రొమాంటిక్ డ్రామా మూవీ ఇప్పట్లో బోల్తా కొట్టింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని కమర్షియల్‍గా డిజాస్టర్ అయింది. అయితే, ఆ చిత్రం ఇప్పుడు సుమారు తొమ్మిదేళ్లకు థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. గత వారం ఫిబ్రవరి 7న మళ్లీ థియేటర్లలో అడుగుపెట్టింది. అయితే, రీ-రిలీజ్‍లో సనమ్ తేరి కసమ్ సెన్సేషనల్ కలెక్షన్లు సాధిస్తోంది.

సనమ్ తేరి కసమ్ సినిమా రీ-రిలీజ్‍లో ఆశ్చర్యపరిచే కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.9.5 కోట్ల నెట్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. హాలీవుడ్ పాపులర్ మూవీ ఇంటర్‌స్టెల్లార్ కూడా రీ-రిలీజ్ సహా రెండు కొత్త చిత్రాలు పోటీలో ఉన్నా.. సనమ్ తేరి కసమ్ వసూళ్లలో జోరు ...