Hyderabad, ఫిబ్రవరి 12 -- Bold Web Series OTT: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో బోల్డ్ కంటెంట్ కు ఏమాత్రం కరువు లేదు. అయితే అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఐదేళ్ల కిందట వచ్చిన ఆశ్రమ్ వెబ్ సిరీస్ మాత్రం వీటన్నింటిలోనూ ప్రత్యేకం అని చెప్పొచ్చు. బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ లీడ్ రోల్ పోషించిన ఈ సిరీస్ మూడో సీజన్ రెండో పార్ట్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. తాజాగా బుధవారం (ఫిబ్రవరి 12) టీజర్ రిలీజ్ చేశారు.

అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2 రానుంది. ఈ బోల్డ్ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటికే వచ్చిన మూడు సీజన్లు బోల్డ్ కంటెంట్ తోపాటు మంచి సస్పెన్స్ తోనూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్ పార్ట్ 2 మరింత బోల్డ్ గా రాబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

తనతోపాటు ఎంతో మందిని భక్తి పేరుతో మోసం చేస్తున్న దొంగ బాబా నిరాళా ఆట కట్టించడాన...