భారతదేశం, ఏప్రిల్ 15 -- Bold Telugu OTT: తెలుగు రొమాంటిక్ మూవీ బిఫోర్ మ్యారేజ్ థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌ధ్నాలుగు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. బిఫోర్ మ్యారేజ్ మూవీలో న‌వీన‌రెడ్డి, భ‌ర‌త్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. నాగ‌మ‌హేష్, సునీత మ‌నోహ‌ర్, సుప్రియ‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

బిఫోర్ మ్యారేజ్ మూవీకి శ్రీధ‌ర్ రెడ్డి అటుకుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించాడు. తొంద‌ర‌పాటు యువ‌త వేసే త‌ప్ప‌ట‌డుగులు వారి జీవితాన్ని ఎలా త‌ల‌క్రిందులు చేస్తాయ‌నే మెసేజ్‌ను ఈ మూవీలో చూపించారు.

ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.5 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ సినిమాకు పెద్ద‌ప‌ల్లి రోహిత్ మ్యూజిక్ అందించ...