భారతదేశం, ఫిబ్రవరి 27 -- Bold OTT: పోర్న్ స్టార్ ష‌కీలా జీవితం ఆధారంగా ష‌కీలా పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ తెర‌కెక్కింది. ఈ బ‌యోపిక్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ రిచా చ‌ద్దా హీరోయిన్‌గా న‌టించింది. ఇంద్ర‌జీత్ లంకేష్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఐదేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో ఈ మూవీ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం కేవ‌లం హిందీలో మాత్ర‌మే స్ట్రీమింగ్ అవుతోంది. ష‌కీలా హిందీ వెర్ష‌న్ ష‌మోరో ఓటీటీతో పాటు ఓటీటీ ప్లే యాప్‌లో అందుబాటులో ఉంది.

ష‌కీలా మూవీలో రిచా చ‌ద్దాతో పాటు పంక‌జ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్లై, ఎస్తేర్ నోరాన్హా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 2020 డిసెంబ‌ర్‌లో ఈ బ‌యోపిక్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు, మూ...