Hyderabad, ఏప్రిల్ 8 -- కోడిగుడ్లతో చేసే రెసిపీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కోడిగుడ్డు ఫ్రై అనగానే అందరికీ నూనెలో కోడి గుడ్డును పగలగొట్టి చేసే ఉక్కిరి గుర్తొస్తుంది. నిజానికి ఉడకబెట్టిన కోడిగుడ్లతో టేస్టీ ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది. ఇక అన్నంలో కలుపుకుని తింటే అద్భుతం అనకుండా ఉండలేరు. చపాతీ, రోటీల్లో కూడా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇక ఉడికించిన కోడిగుడ్లతో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకోండి.

కోడిగుడ్లు - ఐదు

నూనె - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

కసూరి మేథి - అర స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఉల్లిపాయలు - మూడు

పచ్చిమిర్చి - రెండు

పసుపు - అర స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

కారం - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

ధనియాల పొడి - ఒక స్పూను

1. బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసేందుకు ముందుగా కోడ...