Hyderabad, ఫిబ్రవరి 6 -- శరీర దుర్వాసన వేసవిలో ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. దీని వల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణం బ్యాక్టీరియా, చెమట. విచిత్రమేమిటంటే చాలా మందికి తమ శరీరం నుంచి వచ్చే వాసన గురించి తెలియదు. మరికొందరికి తెలిసినా ఏం చేయాలో తెలియక వదిలేస్తారు. ఆ దుర్వాసన పీల్చలేక చుట్టు ఉన్నవారు దూరంగా వెళ్లిపోతారు.

మారిన వాతావరణం, హార్మోన్ల మార్పులు, వారసత్వంగా వచ్చే సమస్యలు, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు వల్ల శరీర దుర్వాసనను పెంచే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యకరమైన అలవాట్లు, ఆహార నియంత్రణ ద్వారా శరీర దుర్వాసన నుంచి దూరంగా ఉండవచ్చు.

హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు (ఇంగ్లిష్)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ తృప్తి అగర్వాల్ సరైన చర్యల ద్వారా ఆ సమస్యలను తగ్గించుకోవచ్చని ...