భారతదేశం, ఏప్రిల్ 3 -- వేసవి కాలం వచ్చిందంటే వేడి కారణంగా శరీరంలో చెమట ఎక్కువగా వస్తుంది. ఇది ప్రజలను బాధించడం ప్రారంభమవుతుంది. ఇతరుల ముందు ఇబ్బందికరమైన పరిస్థితులను తెచ్చిపెడుతుంది. నిజానికి చెమట శరీరాన్ని చల్లబరచడానికి ఒక సహజమైన మార్గమే. అయినప్పటికీ చెమటతో పాటు చాలా సార్లు దుర్గంధం కూడా వస్తుంది. ఇది చాలా మందిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది.

ముఖ్యంగా రోజూ ఆఫీసులకు వెళ్లి పని చేసుకనే వారు, బయట తిరిగే వారు చెమట కారణంగా శరీరం నుంచి వచ్చే దుర్వాసన కారణంగా చాలా ఇబ్బంది పడతారు. పని చేసే చోట, ఇతరులతో మాట్లాడే చోట అసౌకర్యం, అభద్రతగా ఫీలవుతారు. డియోడ్రెంట్లు, పర్ఫూమ్ లు వంటివి ఎన్ని వాడినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని ఫీలవుతారు. మీరు కూడా అలాంటి వారిలో ఒకరైతే ఈ చిట్కాలు మీ కోసం. ఈ సులభమైన, సహజమైన పరిష్కార మార్గాలతో మీ శరీరం నుంచి దుర్వాసన...