Hyderabad, మార్చి 31 -- చీరకు అందాన్ని ఇచ్చేది బ్లౌజులే. చీరకు తగ్గ బ్లౌజు వేసుకుంటేనే ఎవరైనా అందంగా కనిపించేది. చీర కన్నా ఇప్పుడు బ్లవుజులకే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు కూడా. చీర కంటే బ్లౌజ్ డిజైన్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైన్ ట్రెండింగ్ లో ఉంది. ఒకే రంగు చీర, బ్లౌజ్ ధరించడం చాలా తక్కువగా కనిపిస్తోంది. వీటినే కాంట్రాస్ట్ ఫ్యాషన్ అంటారు. చీర రంగుకు నప్పేలా వ్యతిరేక మైన రంగు బ్లవుజును వేసుకుంటారు. ఇక్కడ మేము గులాబీ రంగు చీర మీదకు ఏ బ్లవుజు నప్పుతుందో ఇచ్చాము.

అమ్మాయిలు పింక్ కలర్ ను ఇష్టపడతారు. సాధారణంగా ప్రతి మహిళ దగ్గర పింక్ కలర్ చీరను కచ్చితంగా ఉంటుంది. మీరు ముదురు గులాబీ లేదా లేత గులాబీ రంగు చీరను కుట్టాలనుకుంటే లేదా చీరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కు ఏ రంగు సరిపోతుందో అని ఆలోచిస్తూ ఉంటారు. మీ కన్ఫ...