Hyderabad, ఫిబ్రవరి 21 -- రక్త పరీక్షల ద్వారా మన శరీరంలో ఉన్న అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు. దీర్ఘాయువును పొందాలంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి. కొన్ని రక్త పరీక్షల ద్వారా చాలా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. కాబట్టి ప్రతి ఏడాది ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా, రక్త పరీక్షలు మన శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడానికి సహాయపడతాయి. ఇక్కడ మీరు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 ముఖ్యమైన రక్త పరీక్షల గురించి ఉంది.

లిపిడ్ ప్రొఫైల్: లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రక్తంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కొలుస్తుంది. LDL (చెడు కొలెస్ట్రాల్) పెరిగితే గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. HDL (మంచి కొలెస్ట్రాల్) తగ్గినా కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి లిపిడ్ ప్రొఫై...