Hyderabad, మార్చి 21 -- మనం తినే ఆహారం నుండి ఎంతో చక్కెర విడుదలవుతుంది. అది శరీరంలో గ్లూకోజ్ గా మారి రక్త ప్రవాహంలోకి విడుదలవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరిగిపోతే డయాబెటిస్ వచ్చినట్టు అర్థం.

అందుకే డయాబెటిస్ వచ్చిన వారు చాలా జాగ్రత్తగా ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నవారు దాల్చిన చెక్క ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అంతేకాదు చక్కెర స్థాయిలను చాలా వరకు తగ్గించుకోవచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలు పెద్దవారిలో తెల్లవారుజామున అంటే ఉపవాసం తర్వాత 70 నుంచి 100 లోపు ఉండాలి. అదే ఆహారం తిన్న తర్వాత అయితే 140 కన్నా తక్కువగా ఉండాలి. అదే డయాబెటిస్ వచ్చిన రోగికి అయితే ఉపవాస సమయంలో 80 నుంచి 130 మధ్యలో ఉండాలి. అదే తిన్న రెండు గంటల తర్వాత 150 కంటే తక్కువగా ఉండాలి. కానీ కొంతమందికి రెండు వందల కంటే ఎక్కువ స్థాయిలో ...