Hyderabad, ఏప్రిల్ 6 -- ఆరోగ్యవంతుడైన వ్యక్తి రక్తదానం చేయడం ఎంతో మంచిది. అది మరొక ప్రాణాన్ని నిలబెడుతుంది. మరొక కుటుంబానికి ఆధారాన్ని కల్పిస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తదానం ఎన్నిసార్లు చేయవచ్చో తెలుసుకోండి.

రక్తదానం విషయంలో ప్రజల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. కొందరు రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఆరోగ్యానికి హాని జరుగుతుందని అనుకుంటారు. అందుకే రక్తం దానం చేసేందుకు ముందుకు రారు. అలాగే రక్తహీనత సమస్య వస్తుందని భావిస్తారు. నిజానికి రక్తదానం చేయడం వల్ల మీకు ఎంతో మంచిది. వైద్యులు రక్తాన్ని సేకరించే ముందు మీ శరీరానికి సరిపడా ఉందో లేదో తెలుసుకున్న తర్వాతే రక్తాన్ని సేకరిస్తారు. మీకు సరిపడా లేకపోతే నీ నుంచి రక్తాన్ని సేకరించరు. కాబట్టి రక్తదానం చేసే ముందు మీరు భయపడాల్సిన అవసరం లేదు.

మీకు అన్ని పరీక్షలు చేశాకే రక్తదానం విషయంలో వైద్యులు ముందుకు...