Hyderabad, ఫిబ్రవరి 25 -- మన శరీరంలో రక్తం ఎంతో ముఖ్యమైనది. రక్త పరిమాణం తగ్గితే మనిషి జీవించడం కష్టంగా మారుతుంది. శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే శక్తి రక్తానికి ఉంది. ప్రతి వ్యక్తి శరీరంలో సరైన పరిమాణంలో రక్తం ఉండడం అవసరం. ఎంత రక్తం ఉండాలి? ఒకేసారి ఎంత రక్తం దానం చేయవచ్చో తెలుసుకోండి.

ఆరోగ్యవంతుడైన ఒక వ్యక్తి శరీరంలో దాదాపు 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్తం మొత్తం ఆ వ్యక్తి శరీర బరువులో ఎనిమిది శాతం ఉంటుంది. ఒక వ్యక్తి బరువు 60 కిలోలు అనుకుంటే అతని శరీరంలో 4.8 లీటర్ల రక్తం ఉండాలి. అంటే రక్త పరిమాణం మీ శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది. అయితే పిల్లలు, నవజాత శిశువుల శరీరంలో మాత్రం రక్త పరిమాణం పెద్దలకంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే నవజాత శిశువు బరువులో 10 శాతం రక్తమే ఉంటుంది.

పురుషులు, స్త్రీల శరీరంలో రక్తపరిమాణం ఎంత ఉంటుందో తెలుస...