Hyderabad, జనవరి 2 -- మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నాము. ఫలితంగా 30 నుంచి 40 ఏళ్లు దాటిన వెంటనే వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నాము. మన జీవనశైలి మారుతున్న కొద్దీ మనకు వచ్చే వ్యాధుల సంఖ్య కూడా పెరుగుతోంది. మనం వైద్యుల వద్దకు వెళ్లి మందులు వేసుకుంటాం. అవి దుష్ప్రభావాలను కలిగిస్తాయి.

కాలుష్యం వల్ల రక్తం కూడా పొల్యూట్ అవుతుంది. రక్తం కాలుష్యం వల్ల చర్మ ఇన్ఫెక్షన్ల నుండి క్యాన్సర్ల వరకు అనేక రకాల సమస్యలు వస్తాయి. జుట్టు రాలడానికి కూడా రక్త కాలుష్యం కూడా కారణం ఒకటి. రక్తంలోని వివిధ అంశాలు మన అందాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. రక్తాన్ని శుభ్రపరిచే ఆహారాన్ని తినాల్సిన అసవరం ఉంది.

కాబట్టి మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. ముఖ్యంగా మన ఇంటి వంటగదిల...