Hyderabad, ఫిబ్రవరి 23 -- చలికాలం దాదాపు ముగిసిపోయింది. ఇంట్లోని వెచ్చటి దుప్పట్లు, రగ్గులను శుభ్రంగా ఉతికి దాచుకునే సమయం వచ్చేసింది. వాస్తవానికి దుప్పట్లు(Blankets), రగ్గులు(Rugs) వంటివి వాడటానికి చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ వీటిని ఉతకడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇవి చాలా బరువుగా ఉంటాయి కనుక వీటిని శుభ్రంగా ఉతకడం చాలా కష్టం. అలాగే వీటికి సులభంగా మురికి పడుతుంది.

అయినప్పటికీ శీతాకాలం ముగిసిందంటే రగ్గులు, దుప్పట్లను శుభ్రంగా ఉతికి దాచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవి బయట అలాగే ఉంచితే వీటిలో చాలా మురికి పేరుకుపోతుంది, అంతేకాకుండా ఇవి ఎక్కువ స్థలాన్ని ఆక్రిమిస్తాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా పెద్ద పెద్ద దుప్పట్లు, రగ్గులను కూడా ఈజీగా ఉతికి, భద్రంగా దాచిపెట్టడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటించారంటే ఎంత మురికి పట్టిన రగ్గులు అయి...