భారతదేశం, ఫిబ్రవరి 29 -- Black Wheat Flour: గోధుమలలో నలుపు రకం ఒకటి ఉంది. ఈ నల్ల గోధుమలు పురాతన ధాన్యంగా చెప్పుకుంటారు. వేల సంవత్సరాల ముందే దీన్ని సాగు చేశారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, క్యాల్షియం, జింక్, ఐరన్, పొటాషియం, కాపర్, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. సాధారణ గోధుమలతో పోలిస్తే ఈ నల్ల గోధుమలు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. సాధారణ గోధుమపిండి కన్నా నల్ల గోధుమ పిండిని వాడడం వల్ల ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.

నల్ల గోధుమపిండి మార్కెట్లో లభిస్తుంది. రంగు నలుపుగా ఉన్నా రుచి మాత్రం అదిరిపోతుంది. ఆన్లైన్ మార్కెట్లలో కూడా ఇది అందుబాటులో ఉంది. వారానికి ఒకసారి అయినా ఈ నల్ల గోధుమలను ఆహారంలో చేర్చుకోండి. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు వీటిని తినాల్సిన అవసరం ఉంది.

సాధారణ గోధుమలతో పోలిస్తే నల్ల గోధుమల్లో పో...