Hyderabad, మార్చి 15 -- నల్ల ఉప్పు(Black Sal) గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఏన్నో ఏళ్లుగా దీన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. దీన్నే హిమాలయ ఉప్పు అని కూడా పిలుస్తారు. చాలా మందికి తెలియని మరో విషయం ఏంటంటే.. పెద్ద పెద్ద హోట్లు, రెస్టారెంట్లలోని వంటల్లో నల్ల ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆహారం రుచిని మరింత పెంచుతాయి.

నల్ల ఉప్పులో ఇనుము, పొటాషియం, కాల్షియం, సోడియం క్లోరైడ్ వంటి అనేక ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఆహారం రుచిని మెరుగుపరచడమే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. బ్లాక్ సాల్ట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. కాలా ఉప్పును మితంగా సేవించడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

పీరియడ్స్ సమయంలో నల్ల ఉప్పుతో తయారు చేసిన ఆహార పదార్థాలన...