Hyderabad, ఏప్రిల్ 3 -- బరువు తగ్గాలంటే కఠినమైన వ్యాయామాలతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంటే తక్కువ తినాలని కాదు సరైన పొషకాలతో నిండిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. అంతేకాదు.. కొన్ని రకాల మసాలా దినుసులను కూడా మీ డైట్లో చేర్చుకోవాలి.అవును.. కొన్ని రకాల మసాలా దినుసులు శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించేందుకు చాలా బాగా సహాయపడతాయి. అందులో ముఖ్యమైనవి నల్ల మిరియాలు.

నల్ల మిరియాలు కేవలం సాధారణ మసాలా దినుసు అనుకుంటే మీరు పొరపడ్డట్టే. ఘనమైన వాసన, విభిన్న రుచితో పాటు ఇందులోని పైపరిన్ అనే చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా త్వరగా మంచి ఫలితాలను చూపిస్తాయి. దీనిలోని బయో యాక్టివ్ పదార్థాలు శరీర బరువును చాలా త్వరగా తగ్గించగలరు. ఇందుకోసం మీరు ఏం చేయాలి? నల్ల మిరియాలను డైట్లో ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం...