తెలంగాణ,హైదరాబాద్, మార్చి 21 -- హైదరాబాద్ నగరంలో వేగవంతమైన పట్టణ విస్తరణతో పాటు జనాభా పెరిగిపోతోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు, సేవలను అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. ఈ సవాళ్లను గుర్తించి కేంద్ర ప్రభుత్వం. స్మార్ట్ సిటీస్, అమృత్ పథకాల కింద నిధులు కేటాయించటం ఎంతో ప్రశంసనీయమైనదన్నారు. శుక్రవారం లోక్ సభలో మాట్లాడిన ఈటల. జల్ శక్తి మంత్రిత్వ శాఖకు గ్రాంట్లకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.

దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మాల్కాజ్ గిరిలో వేగంగా పట్టణీకరణ జరుగుతోందని ఈటల చెప్పారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పలు రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధి...