భారతదేశం, జనవరి 28 -- గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌ను ఎల్‌టీటీ ప్రభాకరన్‌, నయీమ్‌‌లతో పోల్చారు. రాజ్యాంగాన్ని విశ్వసించని గద్దర్‌కు పద్మ పురస్కారం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గద్దర్‌ మావోయిస్టులకు చెందిన నాయకుడని.. ఆయన కుమార్తె కాంగ్రెస్‌లో ఉన్నారని గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలా అని ప్రశ్నించారు. రాజీవ్‌ గాంధీని చంపిన వారికి పద్మ పురస్కారం ఇవ్వమంటారా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. విష్ణువర్ధన్‌ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఇదే ఇష్యూపై కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలను, ఎన్ కౌంటర్లలో పోలీసులను పొట్టన బెట్టుకున్న వ్యక్తి గద్దర్ అని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మావోయ...