భారతదేశం, ఏప్రిల్ 11 -- BJP-AIADMK alliance: వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, అన్నాడిఎంకె కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం చెన్నైలో ప్రకటన చేశారు. సీట్ల పంపకాలపై త్వరలో చర్చలు ప్రారంభమవుతాయని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రిత్వ శాఖల పంపకాలు జరుగుతాయని అమిత్ షా వెల్లడించారు. తమిళనాడులో డీఎంకే వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తూ, సనాతన ధర్మం, త్రిభాషా విధానం వంటి అంశాలను తెరపైకి తెస్తోందని అమిత్ షా ఆరోపించారు.

2023 సెప్టెంబర్లో అప్పటి తమిళనాడు చీఫ్ అన్నామలై చేసిన కొన్ని వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) నుంచి ఏఐఏడీఎంకే వైదొలగింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మళ్లీ ఎన్డీఏ గూటికి చేరింది. అన్న...