Hyderabad, ఫిబ్రవరి 22 -- తల్లి కావడం ప్రతి మహిళ జీవితంలో ఒక కీలక దశ. అయితే, ఈ సమయంలో మహిళలు శారీరకంగా, మానసికంగా అనేక మార్పులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో వచ్చేే చిన్నా పెద్దా మార్పులను పూర్తిగా నివారించలేకపోవచ్చు, కానీ వాటిని తగ్గించడానికి కొన్ని ఇంటి చికిత్సలను అనుసరించవచ్చు. గర్భధారణ సమయంలో కొందరికి వంట చేసే వాసన చూస్తే వాంతులు కలిగే అనుభూతి కలుగుతుంది. మరికొందరికి నోరు ఎప్పుడూ చేదుగా ఉంటుంది. ఏం తిన్నా రుచిగా అనిపించదు కూడా. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని నుంచి ఎలా బయటపడాలి అనేది ఇక్కడ తెలుసుకోండి.

గర్భవతిగా ఉన్నప్పుడు మహిళల శరీరంలోని హార్మోన్లలో చాలా మార్పులకు గురవుతుంటాయి. వీటి కారణంగా కొందరికి నోరు చేదుగా, లోహపు రుచిలోకి మారుతుంది. దీన్నే డైస్జూసియా అని అంటారు. ఇది సాధారణ సమస్యే. హార్మోనల్ మార్పుల కారణంగా గర్భధారణ సమయంలో ఓస్ట్ర...