భారతదేశం, మార్చి 3 -- అమెరికాలో వ్యూహాత్మక క్రిప్టో నిల్వలను ఏర్పాటు చేయనున్నట్టు, అగ్రరాజ్యాన్ని ప్రపంచ క్రిప్టో మార్కెట్​ క్యాపిటల్​గా మార్చేందుకు చర్యలు చేపట్టనున్నట్టు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన ప్రకటనతో బిట్​కాయిన్​ సహా మరికొన్ని క్రిప్టోలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. బెంచ్​మార్క్​ కాయిన్​ అయిన బిట్​కాయిన్​ ఏకంగా 95వేల డాలర్ల మార్క్​ని తాకింది.

కాయిన్​మార్కెట్​క్యాప్​ డేటా ప్రకారం ఆదివారం రాత్రి బిట్​కాయిన్​ ధర ఒకానొక దశలో 95,136 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత 94,000 డాలర్ల వద్దకు చేరుకుంది. రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఈథర్ ఆదివారం 13 శాతం పెరిగి 2,516 డాలర్లకు వెళ్లింది.

క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.87 ట్రిలియన్ డాలర్లు కాగా, మార్చి 2 ఉదయం 11:32 గంటలకు మార్కెట్ వాల్యూమ్​ 47 బిలియన్ డాలర్లు దాటాయి. ...