Hyderabad, మార్చి 5 -- గర్భనిరోధక మాత్రలు వేసుకునే మహిళల సంఖ్య అధికంగానే ఉంది. అసురక్షిత సెక్స్ తర్వాత ఇలా గర్భనిరోధక మాత్రలను తీసుకుంటున్నారు ఇవి అవాంఛిత గర్భధారణ నుండి కాపాడినా కూడా కొన్ని రకాల నష్టాన్ని మాత్రం కలిగిస్తాయి. ఈ విషయం ఎంతో మంది మహిళలకు తెలియదు. ఎవరైతే గర్భనిరోధక మాత్రలను అధికంగా వాడతారో వారిలో పురుష లక్షణాలు పెరిగే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

గర్భనిరోధక మాత్రలలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ అనే రెండు హార్మోన్లు ఉంటాయి. గర్భం ధరించడంలో కూడా ఈ హార్మోన్లు పెద్ద పాత్రను పోషిస్తాయి. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల హార్మోన్లను పనిచేయకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల గర్భం రాదు. అయితే ఈ గర్భం మాత్రలు వేసుకోవడం వల్ల స్త్రీలలో 8 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు శరీరానికి పురుష లక్షణాలను కూడా ఇవ్వడం ప్రారంభిస్తాయి....