భారతదేశం, జనవరి 8 -- మనం నిద్రపోయినప్పుడు అనేక కలలు వస్తూ ఉంటాయి. అసలు వచ్చిన కలలను కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కూడా. స్వప్న శాస్త్రం మనకు వచ్చే కలలను బట్టి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చెప్తుంది. మన ఊహలే కలలు అవుతాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం భవిష్యత్తుకు కలలు అద్దం వంటివి. కొన్ని కలలు వస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. సంతోషం పెరుగుతుంది. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది.

అదే కొన్ని కలలు వచ్చినట్లయితే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని స్వప్న శాస్త్రం చెప్తోంది. అయితే, స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఈ పక్షులు కనపడితే ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. మరి స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఎలాంటి పక్షులు కనపడితే శుభ ఫలితాలు ఎదురవుతాయి? ఈ పక్షులు కలలో కనపడితే ఆర్థిక లాభాలు, అదృష్టం, ఆనందాన్ని పొందవచ్చు.

కలలో గుడ్లగూబ కనపడటం చాలా మంచిది. లక్ష్మీదేవి వాహనమ...