భారతదేశం, ఫిబ్రవరి 13 -- Birdflu Terror: ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్‌ జిల్లాలో బర్డ్ ఫ్లూతో భారీగా కోళ్లు చనిపోతుండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్ళకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోదని దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.

గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన రాష్ట్ర పశుసంవర్ధక,వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో పరిస్థితిని సమీక్షించారు.వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, చనిపోయిన కోళ్ళను సక్రమంగా పూడ్చిపెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, పశు సంవర్ధక శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

బర్డ్ ప్లూ వ్య...