భారతదేశం, ఫిబ్రవరి 16 -- Bird Flu in Nellore District:నెల్లూరు జిల్లాలోని బర్డ్‌ఫ్లూపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. కోళ్లకు వచ్చిన వ్యాధి ఏవియన్‌ ఇన్ఫ్లూయాంజగా(Avian influenza) గుర్తించినట్లు వెల్లడించింది. జిల్లాలోని రెండు గ్రామాల్లో తప్ప ఈ వ్యాధి రాష్ట్రంలో ఎక్కడా లేదని తెలిపింది. 712 ర్యాపిడ్‌ టీమ్స్‌ మానిటర్ చేస్తున్నాయని. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

భోపాల్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ కు శాంపిల్స్ పంపామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షల్లో ఇది ఏవియన్ ఇన్ ఫ్లూయెంజ్ (ఏవియన్ ఫ్లూ)గా తేలిందని ప్రకటించింది. కోళ్లు చనిపోయిన గ్రామాలకు కిలోమీటర్ దూరంలో ఇన్పెక్టెడ్ జోన్ గా ప్రకటించామని వివరించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

నెల్లూరు జిల్లా...