భారతదేశం, ఫిబ్రవరి 11 -- Bird Flu Effect : ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. తాజాగా బర్డ్ ఫ్లూ వైరస్ కృష్ణా జిల్లాకూ విస్తరించింది. గంపలగూడెం మండలంలోని కోళ్లకు వైరస్ నిర్థారణ అయ్యింది. ఈ మండలంలో 2 రోజుల్లోనే 10 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వైరస్ సోకి చనిపోయిన కోళ్లను నాశనం చేయాలని అధికారులు పౌల్ట్రీ నిర్వాహకులను ఆదేశించారు. ఈ మండలం చుట్టుపక్కల 10 కి.మీ పరిధిలో చికెన్, గుడ్లు తినొద్దని ప్రజలకు అధికారులు సూచించారు. అయితే 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసాన్ని ఉడికిస్తే ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు అంచనా. తూర్పు గోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ న...