భారతదేశం, ఫిబ్రవరి 16 -- Bird Flu Effect : తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ దెబ్బకు పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడికక్కడ కుప్పలు తెప్పలుగా కోళ్లు మృతి చెందుతున్నాయి. ఒక్క ఏపీలోనే బర్డ్ ఫ్లూ వైరస్ సోకి ఐదున్నర లక్షల కోళ్లు చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలోనూ వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. కోళ్ల మృత్యువాతతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు, బ్యాంకులో రుణాలు తెచ్చి పెట్టుబడి పెట్టామని, వైరస్ తో కోళ్లు మొత్తం చనిపోయాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమపై అప్పుల భారం పడిందని వాపోతున్నారు. తీవ్రంగా నష్టపోయినా పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

బర్డ్ ఫ్లూ ఆందోళనతో ఏపీ, తెలంగాణ ప్రజలు చికెన్, గుడ్లకు దూరంగా ఉంటున్నారు. బర్డ్ ఫ్లూ కేసులు వచ్చిన మండలాల్లో అధికారులు నిష...