Hyderabad, ఫిబ్రవరి 19 -- బర్డ్ ఫ్లూ బారిన పడి లక్షలాదిగా కోళ్ళు మరణిస్తున్నాయి. బర్డ్ ఫ్లూకు కారణమయ్యే ఇన్ఫ్లయేంజా వైరస్ చాలా ప్రమాదకరమైనది. ఇది నేరుగా శ్వాసకోశ వ్యవస్థ పై దాడి చేస్తుంది. అయితే కేవలం కోళ్లకే కాదు ఇతర జంతువులకు కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. ఇప్పుడు ఇళ్లల్లో పెంపుడు జంతువులుగా ఎన్నో పక్షులను, జీవులను పెంచుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ ఎక్కువగా వ్యాపిస్తున్న కాలంలో వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలోని ఆరు జిల్లాల్లో వేలాది కోళ్లను చంపేశారు. గుడ్లను నాశనం చేశారు. బర్డ్ ఫ్లూ కేవలం కోళ్ల ఫామ్‌లకే పరిమితం అవుతుందని ఎంతోమంది అనుకుంటారు. నిజానికి కోళ్ళకే కాదు ఇంకా ఎన్నో జంతువులకు ఈ బర్డ్ ఫ్లూ వైరస్ సోకే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇన్ఫ...