భారతదేశం, ఆగస్టు 24 -- హీరో మోటోకార్ప్ తన కమ్యూటర్ మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ.. గ్లామర్ సిరీస్‌లో భాగంగా "గ్లామర్ ఎక్స్ 125"ను ఇటీవలే విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌తో పాటు సాధారణ గ్లామర్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఎక్స్ 125లో సరికొత్త డిజైన్, మెరుగైన పనితీరు, అధునాతన సాంకేతిక మార్పులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ గ్లామర్​కి గ్లామర్​ ఎక్స్​కి ఉన్న తేడాలను ఇక్కడ తెలుసుకుని, ఏది కొనొచ్చో నిర్ణయం తీసుకోండి..

సాధారణ గ్లామర్ కంటే గ్లామర్ ఎక్స్ 125 బైక్​ మరింత షార్ప్, ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంది. దీనిలో కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్, డార్క్ వైజర్, ఆకర్షణీయమైన 'ఎక్స్' గ్రాఫిక్స్‌తో కూడిన కొత్త ట్యాంక్ ష్రౌడ్‌లు ఉన్నాయి. వెనుక భాగంలో పెద్ద హీరో మోటార్‌సైకిళ్ల నుంచి ప్రేరణ పొందిన టెయిల్-ల్యాంప్స్‌తో ఆధునిక లుక్‌ను తీసుకువచ్చారు. దీని...