భారతదేశం, అక్టోబర్ 12 -- బిహార్‌లో ఒక వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ అతని రెండో భార్య దానికి అభ్యంతరం చెప్పింది. దీంతో కోపంతో రగిలిపోయిన ఆ వ్యక్తి.. తన భార్యపై పెట్రోల్ పోసి, సిలిండర్​ నుంచి గ్యాస్​ వదిలిపెట్టి నిప్పంటించాడు! ఈ దారుణం శనివారం జరిగిందని అధికారులు తెలిపారు.

ఈ ఘటన నలంద జిల్లాలోని ఒక గ్రామంలో జరిగింది. నిందితుడు వికాస్ కుమార్​కు ఐదేళ్ల క్రితం సునీత దేవి (25)తో వివాహమైంది. పెళ్లి అయిన తర్వాతే కుమార్​కి అంతకుముందే పెళ్లయిందనీ, మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదనీ తమకు తెలిసిందని సునీత తండ్రి చెప్పారు.

కుమార్ కుటుంబ సభ్యులు సునీతను తమతో కలిసి జీవించడానికి ఒప్పించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ వారు పుట్టిన కొద్దిసేపటికే చనిపోయారు. ఆ తర్వాత, కుమార్ తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని చెప్...