భారతదేశం, ఫిబ్రవరి 7 -- Bihar crime news: తన కూతురు గర్భం దాల్చడం కోసం ఓ మహిళ, ఒక భూత వైద్యుడి సలహాతో మరో నలుగురి సాయంతో రెండేళ్ల చిన్నారిని బలి ఇచ్చిన ఘటన బీహార్ లోని కైమూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 22న కనిపించకుండా పోయిన చిన్నారి మృతదేహాన్ని జనవరి 29న కుద్రా రైల్వేస్టేషన్ ఉత్తర ప్రాంతంలో ఉన్న ఒక గుంతలో వెలికితీశామని కైమూర్ ఎస్పీ హరి మోహన్ శుక్లా తెలిపారు.

కూతురు గర్భం దాల్చాలంటే చిన్న పిల్లవాడిని బలి ఇవ్వాలన్న భూతవైద్యుడి సలహాతో ఆ మహిళ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లాడిని కిడ్నాప్ చేసి, గొంతు నులిమి చంపేసింది. ఆ చిన్నారి కాళ్లను అతి కిరాతకంగా నరికేసింది. కాళ్లు నరకడానికి ఉపయోగించిన గ్రేడర్ మిషిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు ఈ నరబలి సలహా ఇచ్చిన ...