భారతదేశం, మార్చి 8 -- Bigg Boss Winner: బిగ్ బాస్ గెలిచి సెలబ్రిటీలుగా మారిపోతున్న కొందరు వ్యక్తులు పబ్లిగ్గా రెచ్చిపోతున్నారు. ఏకంగా వ్యక్తులపై దాడులు చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ అయిన ఎల్విష్ యాదవ్.. ఓ యూట్యూబర్ ను దారుణంగా కొట్టిన వీడియో బయటకు వచ్చింది. గురువారం (మార్చి 7) ఈ దాడి జరగగా.. బాధితుడైన యూట్యూబర్ మాక్స్‌టెర్న్ (సాగర్ ఠాకూర్) శుక్రవారం ఈ వీడియోను రిలీజ్ చేశాడు.

ఎల్విష్ యాదవ్ బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్ విన్నర్. తరచూ ఇలాంటి వివాదాలతో అతడు వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో ఎల్విష్.. మ్యాక్స్‌టెర్న్ ఉన్న ఓ స్టోర్ లోకి ఏడెనిమిది మందితో కలిసి వెళ్లి అతనిపై దాడి చేశాడు. తనను కలవడానికి వస్తున్నాడనుకొని వెల్కమ్ చెప్పడానికి వెళ్లిన యూట్యూబర్ ను ఎల్విష్ చెంపపై బలంగా కొట్టాడు.

దీంతో సదరు యూట్యూబర...