భారతదేశం, నవంబర్ 30 -- Bigg Boss Telugu 6 Episode 87: సోమవారం నామినేషన్ల ఎపిసోడ్‌తో రసవ్తతరంగా మారిన బిగ్‌బాస్ హౌస్.. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో టికెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. హౌస్ మేట్స్ అంతా ఈ ఛాన్స్ దక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నామినేషన్లు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ నామినేషన్ల గురించి చర్చ మొదలుపెట్టేశారు. ముందుగా రేవంత్ గురించి ఆదిరెడ్డి ఫైమాతో చర్చిస్తాడు. అనంతరం బాత్రూమ్‌లో కీర్తి, శ్రీసత్యతోనూ ఇదే విషయంపై మాట్లాడతాడు. రేవంత్ తను చేసిన తప్పును అస్సలు ఒప్పుకోడు అని చెబుతాడు.

మరోపక్క రేవంత్.. ఫైమా ప్రవర్తన గురించి మాట్లాడుతుంటాడు. ఫైమా శ్రీహాన్‌తో రేవంత్ గురించి చెబుతుంది. అతడు చేసిన తప్పులను అస్సలు చూపించరంటూ స్పష్టం చేసింది. నేను వేలు చూపిస్తేనే అంత కోపం వచ్చింది.. అతడు తన మాటలను మాత్రం అదుపులో పెట్టుకో...